ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ అభివృద్ధికి జయేష్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎప్రిల్ నెలలో టీ వర్క్స్ ని అవిష్కరిస్తామని చెప్పారు.
బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్. దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు.
IT Minister @KTRTRS formally inaugurated @Intel Design & Engineering Centre in Hyderabad today.#IntelinHyderabad pic.twitter.com/Ohwc4BmHv5
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2019