ధోని భవితవ్యంపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..

296
ganguly

మహేంద్రసింగ్ ధోని భవితవ్యంపై ధోని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చిన బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఈ నేపథ్యంలో ధోని భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ గంగూలీ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ధోనీ ఆడే అవకాశముందా..? అని ప్రశ్నించగా దయచేసి ఈ ప్రశ్న ధోనీని అడగండని సమాధానం ఇచ్చాడు. భారత సెలక్టర్లతో ధోనీ టచ్‌లోనే ఉన్నాడని చెప్పుకొస్తున్న గంగూలీ.. వారి మధ్య జరుగుతున్న చర్చని బహిరంగంగా మీడియాకి వెల్లడించలేమని స్పష్టం చేశాడు.

వాస్తవానికి గత మూడు వారాలుగా ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో విండీస్‌తో సిరీస్‌కి ధోనిని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ ధోనికి షాకిస్తూ పంత్‌ని ఎంపికచేశారు.

Please ask Dhoni was Sourav Ganguly response when the BCCI president was asked if the iconic wicket-keeper batsman would be part of next year’s T20 World Cup in Australia.