జనగాం జిల్లాలో సందడి చేసిన జర్మనీ దేశస్ధులు

313
Jermeny

జర్మనీ కి చెందిన 42మంది బృందం జనగం జిల్లాలో సందడి చేశారు. జనగాం జిల్లాలోని ఓబుల్ కేశవాపురంలో జర్మీని దేశస్తులు పర్యటించారు. ఓబుల్ కేశవాపురంలోని ప్రసిద్ద దేవాలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ని సందర్శించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విశిష్టత ను తెలుసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల తో కలసి గ్రామంలో పర్యటించి సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో జర్మనీ దేశస్థుల టూర్ కోఆర్డినేటర్ సాయి, దేవాలయ నిర్వాహకులు శ్రీమతి బుర్రా గీతా వెంకటేశం, బాలా చారి,రఘు, సర్పంచ్ రేణుక బాల రాజు, MPTC సుజాత జగదీష్, గ్రామస్తులు ప్రభాకర్ రెడ్డి, అంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.