జాతి సంపద అయిన ఇసుక ప్రయోజనాలు స్ధానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందని గనుల శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. గతంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకులు, కాంట్రాక్టర్లకు ఇసుకను దారాదత్తం చేశారన్నారు. ఈ లోపభూయిష్టమైన విధానానికి ముగింపు పలికి విప్లవాత్మకమైన గిరిజన ఇసుక సహాకార సంఘాలను తెరపైకి తెచ్చామన్నారు. మానవీయ కోణంలో మైనింగ్ జరగాలన్న తమ అలోచనక ఈ సంఘాల ద్వార అమలవుతుందన్నారు.
ఈ మేరకు ఇసుక సహాకార సంఘాల ద్వారా వచ్చిన డబ్బులను ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో వందల మంది గిరిజనులకు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని 33 గిరిజన ఇసుక సహకార సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘాల్లో ఇప్పటికే 7939 సభ్యులున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ వచ్చినాక గత రెండు సంవత్సరాల్లో ఈ సహకార సంఘాలకు 17.35 కోట్ల రూపాయాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు తాజాగా కొన్ని సహాకార సంఘాలకు 2.20 కోట్ల చెక్కును అందించారు.
ప్రస్తుతం 21 సోసైటీలు టియస్ యండిసి ద్వారా ఒప్పదం చేసుకోవడం జరిగిందని, మిగిలిన సోసైటీలతోనూ త్వరలో ఒప్పందాలు పూర్తి కానున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామల్లోని గిరిజనులకు లాభం జరిగేలా చూస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామన్నారు. ఇన్నాళ్లు తమ స్ధానిక వనరులు తమ కళ్లముందే తరలిపోయి నష్టపొయిన గిరిజనులకు లాభం చేకూర్చుతామ్ననారు.
భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లోని ఏటూరు, తుపాకుల గూడెం, ముళకట్టె గ్రామల నుంచి వచ్చిన ప్రజలతో మంత్రి మాట్లాడారు. మీ చుట్టు పక్కల నుంచే గతంలో ఇసుక తవ్వుకుపోయినా ఎందుకు ఇలా పైసాలు రాలేవంటూ అడిగారు. గతంలో కేవలం ఈ పైసలన్ని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులే తిన్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి భిన్నంగా ఈ సారి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపించి ములుగు, ఏటూరు నాగారంలో క్వారీలను టియస్ యండికి అప్పజెప్పారన్నారు. అందుకే ఇప్పుడు అక్కడి గిరిజనులకు లాభం అవుతుందన్నారు. ఈ ఇసుక సహకార సంఘాల ద్వారా కుటుంబానికి సూమారుగా లక్షా అరవైల అదాయం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా టియస్ యండిసి ద్వారా 2.20 చెక్కులను వారికి అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గోన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ మాట్లాడారు. మంత్రి కెటి రామారావు సహాకారంతో గిరిజనులకు సహాయం అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సహాకార సంఘాల ద్వారా ఇసుక అమ్మకాల ద్వారా గిరిజనులు అర్ధికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు గిరిజనులంటే ప్రత్యేక అభిమానం ఉందని, వివిధ ప్రాజెక్టులతో పాటు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల అమలుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఈరోజు మంత్రి చెక్కుని తీసుకోవడం అనందంగా ఉందన్నారు. ప్రభుత్వ కృషి వలన గిరిజనులకు మంచి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇందుకు సహాకరించిన మంత్రి కెటి రామారావుకు దన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ సంఘాలకు రావాల్సిన నిధులు సకాలం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రులకు తెలియజేశారు. దీంతో తమ కుటుంబాలకు అర్దికంగా ఆసరా లభిస్తున్నదన్నారు. వీటితో దీంతో తమ పిల్ల విద్యా, అరోగ్య అవసరాలను తీర్చగలుగుతున్నామని అనందం వ్యక్తం చేశారు.