పారిశుధ్య నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నాం: కేటీఆర్

89
ktr
- Advertisement -

దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా అభివృద్ధి లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యా నిర్మూలనకు పెద్ద పీట వేస్తున్నాం అని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి కేటీఆర్‌ స్వచ్ఛ వాహనాలను పంపిణీ చేశారు.

హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని నగరాల కన్నా ముందు ఉందన్నారు మంత్రి కేటీఆర్. సఫాయి కార్మికులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది… నగరంలో ఇంటింటికి తిరిగి చెత్తను కార్మికులు చెత్తను సేకరిస్తున్నారన్నారు. 1350 వాహనాలను ఈ ఒక్క రోజే ప్రారంభించామని తెలిపారు. దీంతో మొత్తం చెత్త సేకరణ వాహనాలు 5,700 పై చిలుకు వాహనాలు హైదరాబాద్ నగరంలో చెత్తను సేకరిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి పెద్ద విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభించుకున్నామని అన్నారు. నగరంలోని అన్ని మూలలకు చెత్త సేకరణ వాహనాలు వెళ్తున్నాయని, నగరంలోని గల్లీలన్ని శుభ్రం అవుతున్నాయని అన్నారు.

- Advertisement -