ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు

25
cec

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసినా వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందడం ఇపుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఖమ్మం లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తీరు పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగిన రాయల నాగేశ్వరరావు. ఈసందర్భంగా కౌంటింగ్‌ను నిలిపివేయాలని కోరారు..

పోలింగ్ ప్రక్రియపై విచారణ జరిపించాలని కోరిన ఆయన.. పోలింగ్ టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో జరిగిందని, కాంగ్రెస్ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక, భక్త రామదాసు క్షేత్రంలో ఓటర్లతో మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించారిన ఈసీకి ఫిర్యాదు చేసిన ఆయన.. మరోవైపు ఫిర్యాదులను పోలీసు యంత్రాంగం పట్టించుకోలదని ఆరోపించారు.

ఖమ్మం సబ్ డివిజన్ అధికారుల ప్రమేయం లేకుండా కౌంటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సీపీ, మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్‌ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.