తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఇవాళ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకానుంది. ఉదయం 6గంటల తర్వాత సచివాలయంలో సుదర్శనయాగం, చండీయాగం వాస్తుయాగంతో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1గంట 20నిమిషాల నుంచి 1గంట 30నిమిషాల మధ్య పూర్ణాహూతి యాగం నిర్వహించిన తర్వాత నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం ఆరవ అంతస్తులోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు.
ఇక మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ తన విధులను నిర్వర్తించనున్నారు.
Also Read:సచివాలయ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్ ఇదే..!
చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ అత్యంత కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేయనున్నారు. దీంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:మోదీ విషసర్పమా.. గరళకంఠుడా ?