కేంద్రంపై ఇక ఉద్యమమే: మంత్రి కేటీఆర్‌

33

ఇన్నాళ్లు విన్నవించాం.. ఇక విడిచిపెట్టేది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. శుక్రవారం సిరిసిల్లలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నేతన్నల బతుకులు మారడానికి మేము చేయూత నిచ్చాం..కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇస్తలేదు. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు మాతో కలిసి కొట్లాడితే మంచిదని హితవు పలికారు. చేనేత ,జౌళి శాఖ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి. నేతన్నల బతుకులు మారడానికి తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందమన్నారు.

తెలంగాణ చేనేత అభివృద్ధికి తోడ్పడాలని ఏడున్నర ఏండ్లుగా ఎన్నో సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయమంటే ఇప్పటికి ఉలుకు లేదు పలుకు లేదు. మరమగ్గాలను ఆధునీకరించడం కోసం సహాయం చేయమంటే పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ చేనేత డెవలప్మెంట్ పథకం కింద 26 బ్లాకులు మంజూరు చేయమంటే 6 చేసి చేతులు దులుపుకొన్నారు మంత్రి విమర్శించారు. మరోవైపు దాన్యం కొనుగోళ్ల విషయంలో మా ఎంపీలు లోక్ సభలో కొట్లాడిర్రు..ఇక నుండి ఉద్యమమే అని మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని హెచ్చరించారు.