ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి..

79
ktr
- Advertisement -

అమెరికాలోని ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు – మన బడికి నిధుల సమీకరణలో భాగంగా ఎన్నారైలతో సమావేశం నిర్వహించారు. దేశంలో 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇంటింటికి నల్ల ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. దేశానికి నిధులు సమకూరుస్తున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అన్నారు.

తెలంగాణ ఏర్పడిన 6 నెలల్లో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా చేశామన్నారు. ఎకనామీలో తెలంగాణ దేశంలో నాలుగో స్ధానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ సమర్థత వల్లే ఇది సాధ్యమైందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చామని దీని ద్వారా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని చెప్పారు.

- Advertisement -