23న నల్గొండకు కేటీఆర్.. బతుకమ్మ చీరల పంపిణి

403
ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 23న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండ పట్టణంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పలువురు అధికారులు పాల్గోననున్నారు.

తెలంగాణ ఆడపడచులకు బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కానుకగా ఈ చీరలను ఇవ్వనుంది. ఈ సారి బతుకమ్మ చీరలు 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల కలర్లతో చీరలను సిద్దం చేశారు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసిందన్నారు మంత్రి కేటీఆర్. 16 వేల మంది నేతన్నలు, 26 వేల మగ్గాలపై ఎంతో కష్టపడి ఈ చీరలను నేశారని చెప్పారు.

- Advertisement -