బిగ్ బాస్3.. రాహుల్ ఎలిమినెట్

369
Rahul
- Advertisement -

బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో విజయవంతంగా 8వారాలు పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మొత్తం హౌస్ లో 10మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఈ వారం నామినేషన్ లో రాహుల్, హిమజ, మహేశ్ లు ఉన్నారు. అయితే ఈవారం ఎవరు ఎలిమినెట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.

అయితే తాజాగా ఇవాల్టీ ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈసారి ఇద్దరు ఎలిమినెట్ అవుతున్నారని ప్రకటించారు నాగార్జున. ఇక అంతే హౌస్ మెట్స్ అందరూ ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఈరోజు ఎలిమినేషన్ లో భాగంగా మొదటి ఎలిమినేటర్ గా రాహుల్ బయటకు వచ్చినట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుంది.

ఇంటి సభ్యులందరూ రాహుల్ కు బాయ్ చెప్పునట్లుగా ప్రోమోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత పునర్ణవి ఎడుస్తు కనిపించడంతో ఇంకా క్లారీటి వచ్చింది. ఇకపై తాను ఎవర్ని తిట్టాలి సార్.. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాగార్జున కు చెప్పంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇవాల్టీ ఎపిసోడ్ ను చూడాల్సిందే.

- Advertisement -