- Advertisement -
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై ఘాటుగా స్పందించారు మంత్రి కేటీఆర్. రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని… రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని చురకలు అంటించిన కేటీఆర్…ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని ప్రశ్నించారు. ఇక ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని ప్రశ్నించారు.
- Advertisement -