పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోండి: మంత్రి కేటీఆర్

170
- Advertisement -

మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

ఎన్నికల రోజును సెలవుదినంగా భావించవద్దని, ఓటింగ్‌లో పాల్గొనకుండా మంచి నాయకులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఓటేయకుండా నేతలను విమర్శిస్తే ఎలాంటి లాభముండదన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్‌ ఉండదని అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నాడు…. రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే కరెంట్‌ సమస్యను అధిగమించాం. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నిత్యం ఘర్షణలుండేవి. ఆరున్నరేళ్లలో కర్ఫ్యూ పెట్టే పరిస్థితి రాకుండా ప్రభుత్వం పనిచేసింది… మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ భద్రత కల్పించాం. మౌలిక వసతులపై సీఎం కేసీఆర్‌ ప్రధానంగా దృష్టిసారించారు.

- Advertisement -