గుత్తాను పరామర్శించిన హోంమంత్రి మహమూద్ అలీ..

50
mlc ali

స్వల్ప అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని సోమాజిగూడా యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని పలువురు ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఫోన్ కాల్ ద్వారా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అలాగే హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా” నర్సింహా చార్యులు, ఎమ్మెల్సీ తెర చిన్నపరెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,టి న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ పి.వి శ్రీనివాస్, తదితరులు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గారిని పరామర్శించారు.