తెలంగాణపై కేంద్రం వివక్ష: కేటీఆర్

54
ktr
- Advertisement -

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష స్పష్టంగా కనిపించిందన్నారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు ఒరింగేమీలేదన్నారు.

మెట్రో రైలు కు నిధులు అడిగామని, ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని ఆయన వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఆయన తెలిపారు.

తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారని, ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు ఉపయోగ పడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -