ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలి: కేటీఆర్

197
ktr
- Advertisement -

ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్‌ పాలసీలతో చిన్న యూనిట్ల నుండి భారీ పరిశ్రమల వరకు స్థాపనకు అవకాశం ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో తెలంగాణ ఆహారశుద్ది పాలసీ,లాజిస్టిక్స్ పాలసీలపై మంత్రులతో సమావేశం నిర్వహించిన కేటీఆర్…పలు సూచనలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు అవుతాయని అన్న మంత్రి కేటీఆర్…ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యత గల ఆహార ఉత్పత్తుల లభ్యత పెరుగుతుంది.స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ యువత, మరియు మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి అన్నారు మంత్రి.

అనంతరం మంత్రులు అందరి సూచనలు పాలసీలో, మార్గదర్శకాల కూర్పులో వినియోగించుకుంటాం అని తెలిపిన మంత్రి కేటిఆర్.ముఖ్యమంత్రి కృషి వల్ల తెలంగాణలో జల విప్లవం వస్తున్నది, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయి: మంత్రి కేటిఆర్ ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతా విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏం పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశాం అన్నారు.రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగింది..ముఖ్యమంత్రి గారి చొరవతో గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదు. దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి.అందువల్ల వెంటనే మనం ఈ ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.తద్వారా మన తెలంగాణ రైతుకు ఆర్థిక స్వావలంబన, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తు న్నాము. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలు పరిశీలించామన్నారు.

మంత్రులు చేసిన సూచనలు:

-మారుతున్న పంటల సరళిని దృష్టిలో ఉంచుకుని ఆహార శుద్ధి కంపెనీలను ప్రోత్సహించాలి

  • పౌల్ట్రీ, మాంస ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి
  • కొన్ని పనులకు వర్కర్ల కొరత ఉన్నది. ఆయా పనుల్లో యాంత్రీకరణ ప్రోత్సహించాలి
  • గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలి. దళిత, మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలు అందిపుచ్చుకు నేలా చర్యలు తీసుకోవాలి.
  • తెలంగాణ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలి. ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి.
  • పాలు, పాల ఉత్పత్తులు విస్తృతంగా అవకాశాలు
  • నూనె గింజల ఉత్పత్తిని పెంచే ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం అందించాలి
  • పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన వల్ల వృధా తగ్గి రైతుకు లాభం
- Advertisement -