ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: కేటీఆర్

66
ktr
- Advertisement -

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో భేటీ అయిన కేటీఆర్… సర్వేల ఆధారంగా.. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో తాజా పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో ఖమ్మంలో మాత్రం 10 సీట్లుంటే ఒకటి మాత్రమే గెలిచామని.. ఈసారి ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనుందన్న విషయంపై కూడా జిల్లా నేతలతో చర్చించారు. ఈ నెల 18, 19 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

- Advertisement -