దుబ్బాకలో టీఆర్ఎస్‌కు ప్రత్యర్థులు లేరని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్…గతంలో తాను దుబ్బాకలో ప్రచారం నిర్వహించానని అక్కడి ప్రజల నాడి తనకు తెలుసన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుందని…కాంగ్రెస్,బీజేపీ డిపాజిట్లు కొల్పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు. తాము మాట్లాడకపోవడం తమ చేతకాని తనం కాదు.. సమయం వచ్చినప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రుల మీద అంత కంటే ఎక్కువ స్థాయిలో మాట్లాడగలమని కేటీఆర్ చెప్పారు.
దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రచారం చేసే విషయంపై కేసీఆరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దుబ్బాకలో తన ప్రచారం అవసరం లేదని అనుకుంటున్నాను. హరీష్ రావు అయినా, తాను అయినా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని తేల్చిచెప్పారు.