మన దుర్గం చెరువును ప్రారంభించిన కేటీఆర్‌..

175
- Advertisement -

ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అత్యాధునిక సదుపాయాలు, ఆహ్లాదకర వాతావరణం సంతరించుకొని మామూలు దుర్గం చెరువు కాస్త ఇప్పుడు ‘మన దుర్గం చెరువు’గా మారింది. హైదరాబాద్‌లోని  ఆధునీకరించిన దుర్గం చెరువును ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ దుర్గం చెరువు సుందరీకరించడానికి ముందుకొచ్చిన రహెజాకర్ప్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

 Minister KT Rama Rao

అయితే..దుర్గం చెరువుపై వంతెనను 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్‌. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులున్నాయని చెప్పుకొచ్చిన ఆయన, అర్బన్‌ కాకతీయ పేరుతో నగరంలోని చెరువులను సుందరీకరిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలాఉండగా… మనసుకు హాయిగొలిపేలా చెరువు.. చుట్టూ అందంగా రూపొందించిన వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా.. పచ్చదనంతోపాటు ఆహ్లాదాన్ని పంచే ల్యాండ్‌స్కేప్‌లు.. ప్రధాన ఆకర్షణగా ఎంట్రెన్స్ ప్లాజా.. మొత్తంగా అలసిన మనసుకు, శరీరానికి ఉపశమనం కలిగించే ఉత్సాహభరిత వాతావరణంతో ఇప్పుడు దుర్గం చెరువు కొత్త రూపురేఖలతో కళకళలాడుతోంది.

Minister KT Rama Rao

.

- Advertisement -