ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు శంకుస్థాపన చేసిన మంత్రి..

19
Minister Koppula

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 2 కోట్లతో పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, స్థానిక శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్త, కార్పోరేటర్లు, కో ఆఫ్షన్ సభ్యులు, కుడా డైరెక్టర్లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో ఎక్కడ దొరుకుతారో ప్రజలకు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఒక క్యాంపు కార్యాలయం ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ నియోజకవర్గంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే క్యాంపు,ఇది అధికారిక క్యాంపు కార్యాలయం ఈ రోజు క్యాంపు కార్యాలయం శంకుస్థాపన సందర్భగా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.