కేంద్రం-రైతు సంఘాల మధ్య 8వ దఫా చర్చలు ప్రారంభం.

23
Farmers Protest

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్ప‌ద వ్యవ‌సాయ చ‌ట్టాల‌పై ఈరోజు కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల నేత‌ల మ‌ధ్య 8వ విడుత చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ మేర‌కు ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో కేంద్ర‌మంత్రులు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, పీయూష్ గోయల్.. 40 రైతు సంఘాల ప్రతినిధులు స‌మావేశ‌మ‌య్యారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై ప్రధాన చర్చ జరగనుంది. కాగా, రైతు నేత‌లు, కేంద్ర సర్కారు మ‌ధ్య ఇప్ప‌టికే 7 విడుత‌లు చ‌ర్చలు జ‌రిగాయి. ఈ ఏడు విడుత‌ల్లోనూ చిన్న‌చిన్న డిమాండ్ల‌ ప‌రిష్కారం త‌ప్ప ఎలాంటి పురుగ‌తి లేదు. ఇవాళ్టి చర్చల్లో పురోగతి లభిస్తుందని కేంద్రం భావిస్తున్నది.