దేశంలో రైతు వేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.కేవలం రైతులను దృష్టిలో పెట్టుకుని వారి కోసమే రైతు వేదిలను సృష్టించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ రోజు ఆయన పెద్దపెల్లి జిల్లా పాలిత గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని,వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే సమాజం అంతా బాగుంటుంది. తన పంటకు రైతు తాను ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలి అన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే రైతు వేదికలను నిర్మించి రైతులను ఒకచోటికి తెస్తున్నారు అని మంత్రి తెలిపారు. వ్యవసాయం బలోపేతం కోసం రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు ఇచ్చి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. వ్యవసాయంలో మెళకువలు, పంటల విధానం, పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు విజ్ఞానం అందిస్తాం. రైతులు బాగుపడడం కోసం వారిని ఏకం చేసిన ఏకైక నేత కేసీఅర్ అని మంత్రి కొనియాడారు.
కరెంటు తలసరి వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంది. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలలో విద్యుత్ భారీ వినియోగం అవుతోంది. తెలంగాణలో రైతు బంధు కోసం 59.21 లక్షల మంది రైతులకు రూ.7357.02 కోట్ల రూపాయలు ఖాతాలలో జమచేయడం జరిగింది. తెలంగాణలో రైతులకు, వ్యవసాయరంగానికే ప్రాధాన్యం అని చెప్పడం దీని లక్ష్యం. వ్యవసాయరంగం బలపడాలి, దేశంలో అత్యధిక శాతం ఆధారపడ్డ ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతుంది. అన్నం పెట్టే రైతు శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే దుస్థితి రావద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ఇన్ని పథకాలు లేవు. కఠోర దీక్షతో కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం. రైతులకు ఇన్నేళ్లు ఏ ప్రభుత్వమూ మేలు చేయలేదు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చినా కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలు ఆపలే, రైతుబంధు ఆపలే, పంటల కొనుగోళ్లు ఆపలేదని మంత్రి పేర్కొన్నారు.
నియంత్రిత సాగులో మొక్క జొన్న వద్దని చెప్పిన కొంత మంది రైతులు పండిస్తే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్.పెట్టుబడులు తగ్గి లాభాలు రావాలని, రైతు రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ రైతు వేదికలు రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడతాయి. కొనుగోలు అమ్మకాలు ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి. దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి అనుగుణంగా మీటింగ్ పెట్టుకొని రక్షించుకోవడానికి అనేక సదుపాయాలతో ఈ వేదికలో ఉపయోగపడతాయి.భవిష్యత్తులో నివేదికలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడ లేవు. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. అనేక పథకాలు దేశంలో ఎక్కడా లేవు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎల్లవేళల రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,పార్టీ మండలాధ్యక్షులు మార్కు లక్ష్మణ్,మార్కెట్ ఛైర్మెన్ శంకర్ నాయక్, పీఏసీఎస్ ఛైర్మెన్ లు దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నరసింహా రెడ్డి,ఆర్‌ఎస్‌ఎస్ మండలాధ్యక్షులు ఇనుగాల అనంతరెడ్డి,తిరుపతి రెడ్డి,సర్పంచ్ కారం పద్మ-రవీందర్, ఎంపీటీసీ లక్ష్మీ-రాజేశం,సర్పంచ్ లు పెరుక రిషిత, అరెపల్లి కవిత-వెంకట్రాజం,సంజీవరెడ్డి,కో ఆప్షన్ హాబీబ్,ఏఓ,ఏఈఓ లు, వ్యవసాయ అధికారులు,గ్రామ పాలక వర్గం, సిబ్బంది,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.