60ఏళ్లలో జరగని అభివృద్ది తెలంగాణ వచ్చాక జరిగిందిః మంత్రి కొప్పుల

308
koppula eshwar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గత 60ఏళ్లలో జరగని అభివృద్ది తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లాలో నేడు పర్యటించారు మంత్రి కొప్పుల. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం తో జిల్లా అభివృద్ధి కి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో నే పెద్దపల్లి ని మొదటి స్థానంలో నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నూతన మున్సిపల్ చట్టం తీసుకువచ్చారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసేలా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. దేశంలోనే అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి 40లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతుందన్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య ను అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ల్లో చదివే ఒక్కో విద్యార్థి పై ఒక లక్ష 25 వేల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం విద్యను అందిస్తుందన్నారు.

- Advertisement -