తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్,రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ నర్సింగరావు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి కొప్పుల దంపతులకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని రాష్ట ప్రిన్సిపాల్ సెక్రటరీ నర్సింగ రావు, వరంగల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఆర్అండ్‌డీ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాస రాజులు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.