కివీస్‌పై భారత్ ఘనవిజయం..

111
india

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 140/5 బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. దీంతో 1-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది భారత్. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌ చెరో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.

నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌.. గంటలోపే కుప్పకూలింది. భారత్‌.. తన మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసి ఆలౌట్‌ అవగా, రెండో ఇన్సింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 276 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకు ఆలౌటవగా, రెండో ఇన్సింగ్స్‌లో 167 పరుగులకే చేతులెత్తేశారు.