జాగృతి వల్లే బతుకమ్మకు గుర్తింపుః మంత్రి కొప్పుల

323
koppula Eshwer

తెలంగాణ రాష్ట్రంలో పేద,ధనిక అనే తేడా లేకుండా గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఒకప్పుడు కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన మాజీ ఎంపీ కవితను అభినందిస్తూ మంత్రి ప్రత్యేక వీడియో సందేశం ఇచ్చారు.

ఈరోజు బతుకమ్మ పండుగకు ఈస్ధాయిలో ఆదరణ రావడానికి కారణం తెలంగాణ జాగృతి అన్నారు. ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను మరింత సంబురంగ జరుపుకునేందుకు మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగతో మలిదశ ఉద్యమంలో ఆడపడుచులను ఐక్యం చేసి, రాష్ట్ర సాధనలో జాగృతి కీలక పాత్ర పోషించిన్నరు మంత్రి కొప్పుల ఈశ్వర్.