అసాధ్యాలను సుసాధ్యం చేయగల మహానాయకుడు కేసీఆర్- కొప్పుల

79
- Advertisement -

నిజామాబాద్ జిల్లా భోధన్ నియోజకవర్గం రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్ లోని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా క్రీ”శే” ఈశ్వరమ్మ సుబ్బారావు శివరామకృష్ణ గార్ల జ్ఞాపకార్థంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నిర్వహించిన గ్రామ ముఖ ద్వారాన్ని, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 25 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, 20 ఇళ్ళకు శంకుస్థాపన, రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, రూ. 30 లక్షల జనరల్ ఫంక్షన్ హాల్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలసి మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…ఈరోజు గ్రామంలో నిర్మించుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, ఫంక్షన్ హాల్, స్వాగత ద్వారం గాని ఇవన్నీ కూడా గ్రామానికి ప్రజల సౌకర్యార్థం కోరకే, నిరంతరం మీ యొక్క అభివృద్ధిలో సేవలో నిమగ్నమై పనిచేస్తూ మీ అందరి మన్నలను పొందుతున్న మహా నాయకులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఒక మాటలో చెప్పాలంటే ప్రజా సమస్యలు పట్టించుకునే నాయకులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక సౌకర్యాలు, సదుపాయాలతో అభివృద్ది జరుగుతుందో ఈరోజు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూసినట్లయితే అర్థం అవుతున్నది అన్నారు.

పదివేల రెండు పడకల ఇల్లు నిర్మాణం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.. తెలంగాణ రాష్ట్రంలో 10 వేల ఇళ్ల నిర్మాణం చేసినటువంటి నియోజకవర్గం బాన్సువాడ ఒక్కటే.. ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి జరగాలంటే నాయకుల యొక్క చొరవ, ఆలోచనా విధానం వల్ల వారి అపారమైన అనుభవం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 360 స్కీములు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో నీళ్ల కోసం తాగునీటి కోసం యూరియా బస్తాలు, కరెంటు కోసం తల్లడిల్లి అటువంటి తెలంగాణ.. ఈరోజు అన్ని మన ముంగిట తీసుకురావడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సాధ్యమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా అసాధ్యాలను సుసాధ్యం చేయగల మహా నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి గౌరవ కేసిఆర్ అని మంత్రి కొనియాడారు.

తెలంగాణ సాధించడంతో పాటు ఈ రాష్ట్రంలో గత 65 సంవత్సరాలుగా ప్రజలు ఏ సమస్యతో సతమతం అయిందో వాటన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం చేసుకుంటూ పోతున్నటువంటి నాయకుడు కేసీఆర్. ఒక అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కపైసా సహకారం చేయలేదు, కాని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసింది. కేంద్రం ఎన్ని అడ్డుకులు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారని మంత్రి కొప్పుల గుర్తు చేశారు.

- Advertisement -