కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష- మంత్రి కొప్పుల

204
Minister Koppula
- Advertisement -

విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా తీర్చి దిద్దారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎం.పి.ఆర్ గార్డెన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ల సమక్షంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 1500 మంది యువత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా తీర్చి దిద్దారు. లక్ష 33వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చాం. మళ్లీ 60వేల ఉద్యోగాలు వేయ బోతున్నాం. మంత్రి కేటీఆర్ ఐటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించి 17లక్షల ఉద్యోగాలు ఇప్పించారు. బిజేపి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని మంత్రి దుయ్యబట్టారు.

ఈ దేశానికి మోది ఏం చేశారో చెప్పాలి. పరిశ్రమలను బిజేపి అమ్ముతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విచ్చల విడిగా పెరిగాయి. వీటితో ట్రాన్స్ పోర్ట్ పై ప్రభావం పడి అన్నింటిపై భారం పడుతుంది. ఎన్నికలు వచ్చాయి అంటే చాలు బిజెపికి చైనా, పాత బస్తీ గుర్తు వస్తుంది.సెంటి మెంట్ తో ప్రజల ఓట్లు వేసుకోవాలని తప్ప మరో ధ్యాస బిజెపికి లేదని మండిపడ్డారు. ఈటెల సానుభూతి కాదు బీజేపీ పార్టీ కనపడాలి. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలే తెరాసకు అనుకూలమని అన్నారు.. ఈటెలను వ్యక్తిగా కాకుండా బీజేపీ నాయకుడిగా చూడాలని.. ఆత్మగౌరవం అన్న ఈటెల బీజేపీ పార్టీలోకి ఎలా వెళ్లారు యువత ఆలోచించాలి మంత్రి తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష..గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు.ఈ ప్రాంతపు బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత హుజురాబాద్ బిడ్డలపై ఉందని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

- Advertisement -