బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన మంత్రులు..

120
- Advertisement -

శుక్రవారం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్,సత్యవతి రాథోడ్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, డాక్టర్ మెతుకు ఆనంద్, హన్మంతు షిండే,శంకర్ నాయక్,చిన్నం దుర్గయ్య,ఆరూరి రమేష్,కోరుకంటి చందర్,క్రాంతి కిరణ్, రవిశంకర్,రేఖా నాయక్,మాజీ ఎంపి సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి,ప్రజల బాగు గురించి ఏ మాత్రం పట్టించుకోకకుండా ప్రతి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే ప్రశంసించకపోగా విమర్శలకు దిగడం తీవ్ర విచారకరం అని మండిపడ్డారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతుంటే బిజెపి నాయకులు ఇక్కడకు వచ్చి చిల్లర వ్యాఖ్యలు చేశారు. వారి వల్ల ఈ పవిత్రమైన స్థలం మలినం కావడంతో అంబేడ్కర్ వాదులు శుద్ధి చేయడం జరిగింది వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అంటే తమకు ఎంతగానో గౌరవమని, టిఆర్ఎస్ పోరాడి అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం 50 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 175 అడుగులలో ఏర్పాటు అవుతున్నది. ఈ కాంస్య విగ్రహం, దేశంలోని అంబేడ్కర్ విగ్రహాలలో అతిపెద్దది. నగరం నడిబొడ్డున సుమారు 12 ఎకరాలలో ఈ విగ్రహం ఏర్పాటు పనులు రేయింబవళ్లు వేగవంతంగా ముందుకు సాగుతున్నయన్నారు. విగ్రహంతో పాటు మ్యూజియం, ధ్యాన మందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫోటో గ్యాలరీ, క్యాంటిన్, అతిథుల కోసం గదులు, టాయిలెట్లు నిర్మిస్తున్నం. అదేవిధంగా సువిశాలమైన పార్కింగ్ తో పాటు పచ్చదనంతో పరిసరాలను సుందరంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు. దివ్య క్షేత్రంగా, స్ఫూర్తి కేంద్రంగా, స్మృతి వనంగా ఎంతోమంది దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది, వర్థిల్లుతుంది అని మంత్రి కొప్పుల తెలపారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… బిజెపి దళితులు, గిరిజనులు, బిసిలు, మైనారిటీలు, పేదలు, మొత్తంగా ప్రజలందరికి వ్యతిరేమైనది. రాజ్యాంగాన్ని మార్చేసేందుకు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పటికి 105 మార్లు సవరణలు జరిగాయి. తమ పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజల పట్ల గౌరవాభిమానాలు ఉన్నాయన్నారు.

- Advertisement -