ఆ దేశంలో రూ.50 పెరిగిన పెట్రోల్ ధరలు..!

109
petrol
- Advertisement -

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం,ఉక్రెయిన్ – రష్యా యుద్దంతో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పెట్రోల్,డీజీల్ ధరలు భారీగా పెరగుతున్నాయి. ఇక మనదేశంలో కూడా ఏక్షణానైనా చమురు ధరలు పెరిగే అవకాశం ఉండనుండగా మన పోరుగుదేశం శ్రీలంకలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి.

లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ధరలు పెరిగిన అనంతరం ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 254కి చేరగా డీజీల్ ధర రూ. 214కి చేరింది.

విలువ డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ రూ.57కి తగ్గింది. నెలరోజుల వ్యవధిలో శ్రీలంకలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడో సారి.

- Advertisement -