బీజేపీ నినాదం అబద్ధాలు చెప్పడం- మంత్రి కొప్పుల

142
minister koppula
- Advertisement -

ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా ప్రజలను మెప్పించే ఆనవాయితీ రాజకీయ పార్టీలలో వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల్లో చిచ్చుపెట్టె మాటలు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శనివారం అయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. అవసరం లేని విషయాలను బీజేపీ ప్రస్తావించి రాష్ట్రంలో కొత్త వాతావరణం సృష్టిస్తోంది. దళితులకు గొప్ప పాలన అందిస్తాం అన్న బీజేపీ మాటలు..ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉందో ప్రజలు గమనించాలి అన్నారు మంత్రి.

10వేల పంపిణీని అడ్డుకుంటుంది బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు అనేది వాస్తవం!. సంబంధం లేని విషయాలతో కేసీఆర్‌కు లింకుపెట్టి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రం నుంచి ఎందుకు ఒక్క రూపాయి వరదలకు తేలేకపోయారు.?.బండి సంజయ్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా అరాచక వాగ్ధానాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ వస్తే కచ్చితంగా అరాచక పాలన చేస్తాం అని చెప్పకనే చెప్తున్నారు!.ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను అశాంతి కలిగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది.

బీజేపీ నేతలు ఒక్కరే దేశ భక్తులా? బీజేపీ లేకముందు దేశంలో ప్రజలకు దేశభక్తి లేదా?.. అని బీజేపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. రాముడు నడయాడిన భద్రాచలంకు బండి సంజయ్,బీజేపీ ఏం చేసిందో చెప్పాలి?..కేసీఆర్‌ను అక్బర్‌కు వారసుడు అనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ రాజకీయాల్లో ఉండదగ్గ మనుషులు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడటం లేదు!.ముఖ్యమంత్రి కేసీఆర్ వందశాతం సెక్యులర్ వాదీ. రాష్ట్రంలో టీఆర్‌స్ అధికారంలోకి వచ్చాక 400 స్కిమ్స్ అమలు చేస్తున్నాము. బండి సంజయ్- ధర్మపురి అరవింద్‌కు మాట్లాడే అర్హత లేదు. బీజేపీ నేతల మాటల తీరు పూటకు గతి లేదు మాటకు మతి లేదు అన్నట్టు ఉన్నాయని మంత్రి ఎద్దేవ చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాట్లాడాల్సిన మాటలు బీజేపీ మాట్లాడటం లేదు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. అరవింద్ నిజామాబాద్ పసుపు బోర్డ్ తెస్తా అని మాట తప్పారు!.రాజకీయాల్లో నిబద్ధత లేని వ్యక్తి అరవింద్ అని విమర్శించారు. మతతత్వం కలిగిన పార్టీ కాబట్టే దేశ ప్రజలు అనేక సంవత్సరాలు బీజేపీని దూరం పెట్టారు. బీజేపీ నినాధమే అభివృద్ధి నిరోధక విధానం..బీజేపీ నినాదం అబద్ధాలు చెప్పడం. బీజేపీకి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దుయ్యబట్టారు.

- Advertisement -