హిందుత్వానికి బీజేపీ వక్ర భాష్యం చెబుతోంది- కేకే

132
kk
- Advertisement -

హిందుత్వం అనేది ప్రతి ఒక్కరికి సమానతను కోరుతుంది. కానీ హిందుత్వంకు బీజేపీ వక్ర భాష్యం చెబుతోందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు.శనివారం తెలంగాణ భవన్‌లో కేశవరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను ఆదరించేదే హిందూ మతం. దేవున్ని నమ్మే వాళ్ళు,నమ్మని వాళ్ళు కూడా హిందువుల్లో ఉంటారు.ప్రస్తుత సమాజంలో సామాజిక సామరస్యత కోసమే టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఏకం సత్…సిద్ధాంతాన్ని అమలు చేసే పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ కంటే నిజమైన హిందువు ఎవ్వరూ లేరు!..ఆయన చేసినన్నీ పూజలు,యాగాలు నేను కూడా చేయలేదు అన్నారు కేకే.

నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాను.సామాజిక న్యాయం కోసం ఆ పార్టీలో ప్రయత్నించాం. కానీ టీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాటించింది..మాది సామాజిక న్యాయ ప్రభుత్వమన్నారు. గ్రామాల్లో ఉండే స్కూల్స్ అన్ని వర్గాలకు అందుబాటులో లేకపోవడం వల్లే రెసిడెన్షియల్ స్కూల్స్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది..వరద భాదితులకు ఆదుకునేందుకు ఒక్క క్షణం ఆలోచించకుండా నిధులు విడుదల చేసారు..వరదల్లో నష్టపోయిన వారికి డబ్బులు పంచడం పాపమా?..వరద సాయాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ ,బీజేపీ లే.ఎన్నికలు ముగిశాక ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు.

కేసీఆర్ తీసుకొచ్చే ప్రతి పథకంలో సామాజిక కోణం ఉంటుంది. ఇక్కడ అమలవుతున్న పథకాలు మరెక్కడా లేవు. కేటీఆర్ డైనమిక్ నేత హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ ముద్ర ఎంతో ఉంది.హైదరాబాద్ ప్రజలు అన్ని ఆలోచించే ఓట్లు వేస్తారు అని ఎంపీ కే కేశవరావు తెలిపారు.

- Advertisement -