వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.గతంలో కబ్జాకు గురై న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆస్తులను పరిరక్షించే విషయంలో అలక్ష్యం, అశ్రద్ధను విడనాడాలని, కచ్చితంగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలోని వక్ఫ్ భూములు, ఆస్తులు, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేయాలని…. భూములు, ఆస్తుల పరిరక్షణకు రెవెన్యూ, పోలీస్, ల్యాండ్ సర్వే శాఖలకు చెందిన అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రస్తుతం ఉన్న తొమ్మిది స్టాండింగ్ కౌన్సిళ్ల స్థానంలో కొత్త వారిని నియమించాలని, ఆస్తులను కాపాడడంలో భాగంగా అధికారులతో కలిసి మంత్రి జిల్లాలలో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు.