కరోనా నుండి కోలుకున్న మంత్రి కొప్పుల..

99
koppula
- Advertisement -

కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మంత్రి సతీమణి స్నేహలతకు ఈ నెల 6న పాజిటివ్ రాగా 9న కొప్పులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. చికిత్స పొందిన అనంతరం ఈశ్వర్ దంపతులు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

వైద్యుల సలహా మేరకు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నామని… కరోనా మహమ్మారిని జయించడానికి నాకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని మంత్రి తెలిపారు.

- Advertisement -