దేశానికే ఆదర్శంగా గురుకులాలు: మంత్రి కొప్పుల

233
koppula
- Advertisement -

దేశానికే ఆదర్శంగా తెలంగాణ గురుకులాలు నిలిచాయన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. హైదరాబాద్ నగరంలోని షేక్ పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో శుక్రవారం మోడల్ UNO సదస్సు, మోడల్ పార్లమెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల ఈశ్వర్‌…మన గురుకుల విద్యా సంస్థలు విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా అందిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపించే ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప పాలనాదక్షులు అన్నారు.

అన్ని వర్గాల వాళ్లు ఉన్నత విద్యావంతులు కావాలనే దృఢ సంకల్పం కలిగిన కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 970 గురుకులాలు ఉన్నాయి….మోడల్ UNO, మోడల్ పార్లమెంట్ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారని కొనియాడారు.

- Advertisement -