శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల..

30
srinivas goud

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించారు మంత్రి కొప్పుల ఈశ్వర్,పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు,ఎంపీ వెంకటేష్. తండ్రి మ‌ర‌ణంతో తీవ్ర విచారంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను సోమవారం వారు ప‌రామ‌ర్శించారు. మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో శ్రీనివాస్ గౌడ్ తండ్రి సమాధిని సందర్శించి,చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

శ్రీనివాస్ గౌడ్‌ను ఆయన కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి,ఎంపి, జెడ్పీ ఛైర్మన్ పరామర్శించి, తీవ్ర సంతాపాన్ని,ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

శ్రీనివాస్ గౌడ్ తండ్రి,తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకులు, రిటైర్డు హెడ్ మాస్టర్ నారాయణ గౌడ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.