టీఆర్ఎస్‌కు ఓటేయండి..చేర్యాల అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్‌

23
harish

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో జనగామ జిల్లా తెరాస కార్యకర్తల సమావేశం జరుగగా ముఖ్య అతిధిగా హాజరయ్యారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన …తెలంగాణలో ఇంటింటికి నల్లా పెట్టి నీరు ఇచ్చే కార్యక్రమం తెరాస ప్రభుత్వం దిగ్విజయంగా నెరవేర్చిందన్నారు.

50 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ పాలన సాగించాయి. కనీసం తాగు నీరు ఇవ్వలేదని…తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చాక చెర్యాల, కొమరెల్లిలలో, మద్దూరులో, ధూల్ మెట్టలో మంచి నీటి సమస్య ఉందా… ఇంటింటికీ తాగు నీరు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇది తెరాసకు ఇతర పార్టీలకు తేడా అన్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ వెల్లా.. అక్కడ ఆడబిడ్డ పెళ్లి పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చేది సున్నా. ఇక్కడ లక్ష రూపాయలు పెళ్లికి ప్రభుత్వం ఇస్తుందన్నారు.

అక్కడ రైతును కలిశా.. ఎన్ని ఎకరాలు వేసావంటే ఐదు ఎకరాలు వేశా అన్నాడు. సాగు నీరు ఉందా.. అంటే.. కరెంటు రోజుకు పది సార్లు వచ్చి పోతుందని.. ఐదెకరాలకు నీరు పారాలంటే పది రోజులు పడుతుందని చెప్పారని తెలిపారు. ఇవాళ ఉదయం సీఎంగారు ఫోన్ చేశారు. చేర్యాల మండలం ఆకునూరులో ఓ చేను మడి ఎండిపోయిందని పేపర్లో వ చ్చింది… వెంటనే వి ద్యుత్ డీఈని సస్పెండ్ చేయమని చెప్పారు. 24 గంటల్లో ట్రాన్స్ ఫార్మర్ పెట్టమని… ఒక్క మడి కూడా ఎండిపోవద్దని చెప్పారు.

ఎక్కడో పేపర్లో వస్తే…సీఎం గారు ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని నాకు ఫోన్ చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం పని తీరు అని చెప్పారు.కర్ణాటకలో చేలు ఎండిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు…. రైతుకు పెట్టుబడి సాయం అందుతుందా అంటే కర్ణాటక రైతు ఆరు వేలు వచ్చిందని చెప్పారు. ఐదెకరాలకు ఆరువేలు వచ్చింది అతనికి. మన దగ్గర ఐదు ఎకరాలకు 56 వేలు వస్తాయని చెప్పారు.

అక్కడ ఆరు గంటల కరెంటు వస్తే… ఇక్కడ 24 గంటల కరెంటు…పెన్షన్ ఎంత వస్తుందని ఓ భర్త చనిపోయిన మహిళను అడిగితె ఐదు వందలని చెప్పింది. మన దగ్గర 2016 వస్తుంది. ఎంత తేడా ఉంది.. తేడా ఏంటంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ తెరాస ప్రభుత్వం. అది కర్ణాటక రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రం అన్నారు.ఇక్కడ బీజేపీవాళ్లు నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేనే ఒక బస్సు పెట్టి కర్ణాటక తీసుకెళ్తా… మీరు మాట్లాడితే ఇక్కడ కాదు… చేతనయితే ఢిల్లీలో మాట్లాడాలన్నారు.