టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి- మంత్రి కొప్పుల

146
minister koppula
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.శుక్రవారం గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురులేని మహానాయకులని.. కేసీఆర్, కేటీఆర్ ల నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు మంత్రి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు ఘన విజయం చేకూర్చిన హైదరాబాద్ మహా నగర ఓటర్లు,ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపికి ఈ గడ్డపై ఏ మాత్రం స్థానం లేదు, విజ్ఞులైన హైదరాబాద్ ఓటర్లు ఆ పార్టీ నాయకుల దుందుడుకు వైఖరిని, అబద్ధాలు,అసత్యాలను ఛీ కొట్టారని మంత్రి అన్నారు. ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం చెమటోడ్చిన టిఆర్ఎస్ శ్రేణులు, మద్దతుగా నిలిచిన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు,ఇతర రాష్ట్రాలు,భాషలకు చెందిన హైదరాబాద్ నగర వాసులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

కేసీఆర్ మార్గనిర్దేశనంలో కేటీఆర్ మరింత ఉత్సాహాన్ని పుంజుకుని తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెస్తారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని ప్రజలు ఆశిస్తున్నారు.ప్రజల ఆశలు, ఆశయాలు తప్పక నెరవేరుతాయని, దేశం మొత్తం మీద తెలంగాణ అన్ని మంచి అంశాలలో అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

- Advertisement -