రామ్ చరణ్‌తో రష్మిక రొమాన్స్‌..

122
Rashmika

హీరోయిన్‌ రష్మిక మందన టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ చిత్రాల విజయాలతో భారీ విజయాలు అందుకుంది. దీంతో టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఈ బ్యూటీవైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక పారితోషికం కూడా బాగానే పెంచేసింది. అయినా, ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా ఈ ముద్దుగుమ్మకు తాజాగా వచ్చినట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో రామ్ చరణ్ అతిథిగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఆయన ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన హీరోయిన్ కూడా వుంటుందట. దాంతో తాజాగా ఆ పాత్రకు రష్మికను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. వచ్చే ఏడాది ఆమె ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు.