గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఖమ్మం ఆర్‌పిఎఫ్ సిఐ..

42
Khammam RPF CI Madhusudan

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఖమ్మం అర్‌పిఎఫ్ సి ఐ మధుసూదన్ మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామంలో నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం ఖమ్మం ఆర్‌పిఎఫ్ సిఐ మధుసూదన్ మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని మొక్కలు నాటడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటపతిరాజు గ్రామ సర్పంచ్ కోట ఎలీషా, నేనున్నా మహిళ మండలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మెరుగు మానస, ప్రధాన కార్యదర్శి బొల్లేపోగు త్రివేణి,మెరుగు రత్నరాజు రాంబాబు గ్రామ కార్యదర్శి రాధాకృష్ణ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.