తడి, పొడి చెత్త వాహనాలను ప్రారంభించిన మంత్రి కొప్పుల..

29
Minister Koppula Eshwar

గురువారం ధర్మపురి మున్సిపాలిటీకి మంజూరు అయిన స్వచ్ఛ భారత్ ఎనిమిది తడి, పొడి చెత్త నూతన వాహనాలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. అలాగే అనంతరం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు మంత్రి కొప్పుల. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ , వైస్ ఛైర్మన్ రామన్న, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.