రైతు వేదికను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి

24
Minister Sabitha Reddy

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మహేశ్వరం మండలంలోని నాగారం, దుబ్బచెర్ల గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మహేశ్వరం మండలం ఎంపీపీ గట్టుపల్లి రఘు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మహేశ్వరం నియోజక వర్గంలో మన్సాన్ పల్లి,పెండ్యాల, దిల్వర్ గూడ గ్రామంలో సీసీ రోడ్లు మరియు భూగర్బ డ్రైనేజీ పనులను మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి ప్రారంబించారు.