తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమంతో కోసం ఆహర్నీశలు కృషి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి పురస్కరించుకొని మలక్‌పేట్‌లోని దివ్యాంగుల సహకార సంస్థ కార్యాలయంలో ఎత్తయిన లూయిస్ బ్రెయిలీ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లుడుతూ…అంధుల కోసం లూయిస్ బ్రెయిలీ అక్షర ప్రధాతగా నిలిచారని కొనియాడారు. దివ్యాంగుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో తన అంధత్వాన్ని జయించిన లూయిస్ బ్రెయిలీ లిపిని రూపొందించి కంటి చూపు లేని వారి కోసం ఒక దివిటిగా మారారని అన్నారు. తెలంగాణలో 5 లక్షల 51 వేల మంది దివ్యాంగులకు సంవత్సరానికి రూ. 2000 కోట్లను ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఎదైనా ఉంటే అది తెలంగాణ అని అన్నారు. ప్రతి సంవత్సరం దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ను రూ.20కోట్ల నుంచి రూ.83కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు.
దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా ఉమ్మడి పాలనలో కేవలం 30 శాతం సబ్సిడీతో మాత్రమే సహాయ ఉపకరణాలు అందేవని కానీ నేడు వందశాతం సబ్సిడీతో ఉచితంగా అనేక సహాయ ఉపకరణాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహామూద్ అలీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి, దివ్యాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్ రావుతో పాటు పలువురు వికలాంగుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి…