బీజేపీకి దిమ్మదిరిగే గుణపాఠం చెప్పాలి- మంత్రి కొప్పుల

53

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 11,12వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు ,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలతో మాట్లాడారు.

దళిత వ్యతిరేకి బీజేపీ పార్టీ.. ఈటల రాజేందర్‌కు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపించారు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళిత బంధు ప్రారంభమైతది.. అందరికీ యూనిట్లు వస్తయ్‌. కానీ, ఇక్కడో విషయం తెలుసుకోవాలే.. మన కోసం పనిచేసే టోళ్లేవరు..? మనలను ఎదగనీయ్యకుండా చేసేదెవరు..? తెలుసుకోవాలి. ఆలోచించాలే. దళితులు బీజేపీని తరిమి కొట్టాలే. ఇక్క‌డ‌ స్థానం లేకుండా చేయాలే. 30న జరిగే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి దిమ్మదిరిగే గుణపాఠం చెప్పాలే. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకోవాలి..’అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు.