‘భీమ్లా నాయక్‌’కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్..

46

మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో “భీమ్లా నాయక్” పేరుతో టాలీవుడ్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిపిందే. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు సమకూరుస్తున్నారు.

ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ లు, పాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించనుండగా, రానా డానియల్ శేఖర్ గా కనిపించనున్నారు. పవన్ కి జంటగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ ఇందులో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చిత్ర నిర్మాతలకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడీ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ నుంచి రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న మేకర్స్ ఈ ఆఫర్ కి ఒప్పుకుంటారా? అన్నది చూడాలి! ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.