కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం: మంత్రి కొప్పుల

230
koppula
- Advertisement -

కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమం ఆగలేదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. సాగుకు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథిగా హాజరైన కొప్పుల… రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు.

రూ.600 కోట్లు ఖర్చుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలను నిర్మించామని వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు రూ.7200 కోట్లు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

డిసెంబర్ 27నుంచి రైతుల ఖాతాల్లో రెండో విడుత రైతుబంధు నగదు జమచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని మండిపడ్డారు.

- Advertisement -