హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివ శక్తి ఫౌండేషన్ సంస్థ అనే పేరుతో హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. సంస్థలో ఆర్ధిక లావాదేవీలను ప్రశ్నించినందుకు మా పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించింది.
2017లో కరుణాకర్, సుగుణ అధ్యక్షుడిగా శివ శక్తి ఆధ్యాత్మిక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. పాస్టర్‌తో కుమ్మైకై ఉపాధ్యక్షుడు పీవీ సతీష్, సభ్యులు విజయ్ కుమార్, శ్రీనివాస రాజు మరో ఇద్దరిని ఫోర్జరీ చేసి తప్పించారు. చీకటి ఒప్పందం చేసుకొని హిందువులు ముందు ఫౌండేషన్, సొసైటీ లకు రెండు సార్లు గత ఏడాది ఈ ఏడాది ఫండ్స్ వసూలు చేసారు. నేనూ నిలదీసి సీసీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చాను.
సొంత అప్పు తీర్చడానికి లాభాపేక్ష లేని సంస్థ నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. హిందు బందువులు ఎవరైనా శివ శక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివ శక్తి ఫౌండేషన్ లకు హిందువులు ఎవరూ విరాళాలు ఇవ్వకండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు పలు సెక్షన్ల తో A1గా కరుణాకర్ సుగ్గున, A2గా దేవిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి, A3గా సునీత రెడ్డి కేసు నమోదు చేసి పోలీసులు గాలిస్తున్నారు.

