బీసీలు టీఆర్‌ఎస్‌తోనే ఉంటారు: మంత్రి గంగుల

193
Minister Gangula Kamalakar
- Advertisement -

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షడు కె .లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దరిదాపుల్లోకి కూడా బీసీలు వెళ్ళరు. బీసీలు టీఆర్‌ఎస్‌తోనే శాశ్వతంగా ఉంటారని..బీసీ లకు టీఆర్‌ఎస్‌కు విడదీయరాని బంధం ఉందన్నారు. ఎన్నో యేళ్లుగా బీసీ కులాల్లో చేర్చాలని 17 కులాలు మొత్తుకున్నా గత పాలకులు కరుణించ లేదు. కెసిఆర్ ప్రత్యేక చొరవతో ఇటీవల 17 కులాలను బీసీ జాబితాలో చేర్చారని మంత్రి తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ కులాలను బీసీ జాబితాల్లో చేర్చడాన్ని స్వాగతించారు.బీసీల కోసం బడ్జెట్ ను భారీగా పెంచింది కెసిఆర్ ప్రభుత్వమే. బీసీ పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు ,కాలేజీలు భారీగా పెంచింది కెసిఆర్ ప్రభుత్వమే..గతంలోఆరువేల లోపు బీసీ విద్యార్థులకే ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్య అందింది..ఇపుడు లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ విద్యార్థులకు ఇపుడు ఓవర్సేస్ చదువుల కోసం స్కాలర్ షిప్ అందుతోంది..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు ఇలాంటి ప్రత్యేక పథకాలు అమలు జరగడం లేదన్నారు.

కోకాపేటలో 82 కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నాం.ఇవన్నీ చేస్తున్నందుకు బీసీలు టీఆర్‌ఎస్‌కు దూరమవుతారా లక్ష్మణ్ చెప్పాలి..అసలు ఎంబీసీలను గుర్తించిందే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..బీజేపీ వారి కోసం ఏం చేసిందో లక్ష్మణ్ చెప్పాలి అని మంత్రి ప్రశ్నించారు. భూమి మీద టీఆర్‌ఎస్‌ ఉన్నంత కాలం ఈ పార్టీ వెంటే బీసీలు ఉంటారు.అన్ని బీసీ కులాలకు మా ప్రభుత్వంలో ఏదో రూపంలో న్యాయం జరుగుతోంది. కేంద్రంలో ఓబీసీల మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు. ఒకపుడు ఉరి సిల్లాగా ఉన్న సిరిసిల్లను నేతన్నల పాలిట నిజమైన సిరిసిల్లా గా మార్చామని మంత్రి స్పష్టం చేశారు.

ఇందుకోసం కెసిఆర్ కేంద్రాన్ని చాలా సార్లు అడిగారు. లక్ష్మణ్ ఇందుకోసం చొరవ తీసుకుంటే స్వాగతిస్తాం. కెసిఆర్ బీసీల పాలిట దైవ సమానులు. వారిని వీడే ప్రసక్తే లేదు. అన్ని రాష్ట్రాల్లో కెసిఆర్ లాంటి నేత ఉండాలని బీసీలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటే కెసిఆర్ దేశానికి నాయకత్వం వహిస్తారు. కెసిఆర్ తమ రాష్ట్రంలో ఎందుకు పుట్ట లేదు అని అన్ని రాష్ట్రాల వారు అనుకునే పరిస్థితి ఉంది. కెసిఆర్ ,బీసీ లు వేర్వేరు కాదని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

- Advertisement -