పెద్దగట్టు జాతర అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మంత్రి తలసానితో కలిసి పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి…పెద్దగట్టు జాతర ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారని, సంక్షేమ పథకాల్లోనూ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 50 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు తలసాని.
లక్షలాది మంది భక్తులకు తాగునీరు, వసతులు కల్పించిన మంత్రి జగదీశ్ రెడ్డికి యాదవ సామాజికవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తలసాని. యాదవులు ఇలవేల్పు లింగమంతుల స్వామి కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.