పల్లెల సంస్కృతిని పరిరక్షించుకోవాలి- మంత్రి జగదీశ్ రెడ్డి

41
- Advertisement -

పల్లెల సంస్కృతి, సాంప్రదాయాలకు ఎద్దుల పందాలు ప్రతీక అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లోని చీదేళ్ళ గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందాలను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు ఆలయం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలిపారు.. తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు గ్రామంలో ప్రతీ ఒక్కరికీ కలగాలని అమ్మవారిని కొరుకున్నట్లు తెలిపిన మంత్రి అంతరించి పోతున్న ఒంగోలు జాతి పశు సంపదను పరిరక్షణకు గ్రామీణ ప్రాంతంలోని ప్రతీ ఒక్కరం కృషి చేయాలని మంత్రి కోరారు..

మంత్రి ప్రారంభించడమే తరువాయి యజమానులు తమపై పెట్టుకున్న ఆశలు ఏ మాత్రం వమ్ము చేయకుండా ఎద్దులు పోటా పోటీగా బల ప్రదర్శన చేసి ప్రజలను ఆకట్టుకున్నాయి.. జాతర వచ్చిన చిన్నారులు,యువకులు మంత్రితో సెల్ఫీ దిగడానికి పోటీలు పడటంతోవారిని నిరాశ పరచకుండా గంట సేపు ప్రతీ ఒక్కరితో సెల్ఫీ లు దిగి సంతోష పెట్టారు.. మంత్రికి గ్రామానికి వచ్చిన సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, పెద్దగట్టు డైరెక్టర్ ఆవుల అంజయ్య యాదవ్, రైతు సమన్వయ అధ్యక్షుడు గుర్రం అమృతా రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ దాచేపల్లి భరత్, మిరియాల వెంకటేశ్వర్లు, గ్రామ టి. ఆర్.ఎస్ అధ్యక్షుడు వెంకట్ రావ్,స్వాగతం పలికారు.

- Advertisement -